కోల్‌కతా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నేను అమాయకుడిని అంటూ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న నిందితుడు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుడు సంజయ్‌ రాయ్‌ విచారణలో భాగంగా CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం.

Sanjay Roy (Photo Credit : Google)

Kolkata Doctor Case : కోర్టు ముందు హాజరైనప్పుడు..నాకేం తెలియదు..నేను ఉత్తి అమాయకుడిని..నన్ను కావాలనే ఇరికించారు… అంతకుముందు సీబీఐ విచారణలో నేనే చేశాను. కామంతో చేశాను..కావాలని చేశాను.. ఇదీ కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ కేసులో నిందితుడి విశ్వరూపం యాక్టింగ్. ఊసరవెల్లి.. ఒక్కో చెట్టుపై ఒక్కో రంగు మార్చినట్లు..నిందితుడు సంజయ్ .. ఒక్కో సిచువేషన్‌లో ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నాడు.

నేను అమాయ‌కుడిని, ఏ త‌ప్పు చేయ‌లేదని కంటతడి..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుడు సంజయ్‌ రాయ్‌ విచారణలో భాగంగా CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. పాలీగ్రాఫ్ టెస్ట్‌కు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురయ్యాడట. తాను అమాయ‌కుడినిని… ఏ త‌ప్పు చేయ‌లేదని చెప్పాడట. తన‌ను ఈ కేసులో కావాల‌ని ఇరికించారని, ఈ ప‌రీక్షలో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుందంటూ జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.. దీంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.

సీబీఐ కోర్టులో కన్నీరు పెట్టుకుంటూ మరో ట్విస్ట్..
ఇదిలా ఉంటే అంతకు ముందు సీబీఐతో పాటు సిట్‌ అధికారులు సంజయ్ రాయ్‌ని విచారించారు. ఆ సమయంలో నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు తాను ఏం చేశాడో పూసగుచ్చినట్టుగా అంతా వివరించాడు. పైగా సీసీ కెమెరాలో సంజయ్ రాయ్ కనిపించడం, అక్కడే అతని బ్లూటూత్ డివైజ్ దొరకడం లాంటి ఆధారాలు మరింత బలం చేకూర్చాయి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నిందితుడు తానేమీ చేయలేదని కన్నీళ్లు పెట్టుకోవడంతో సీబీఐ, సిట్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే నిందితుడికి సీబీఐ అధికారులు సైకోనాలసిస్ టెస్ట్ చేశారు. ఆ సందర్భంలో సంజయ్‌లో కనీసం భయం, బాధ అనేవి కనిపించలేదని సీబీఐ అధికారులు గుర్తించారు. మానవ మృగంలా అతడి ప్రవర్తన తీరు ఉందని తెలిసింది. అయితే తాజాగా సీబీఐ కోర్టులో కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడుతూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.

కేసులో రోజురోజుకు కొత్త సందేహాలు..
మరోవైపు ఈ కేసులో రోజురోజుకు కొత్త సందేహాలు.. సరికొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి డెవలప్ మెంట్ ఒకటి వెలుగు చూసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పని చేయటం లేదన్న విషయాన్ని సీబీఐ వెల్లడించింది. సెమినార్ హాల్ కు డోర్ బోల్ట్ లేనప్పుడు.. హాల్ లోపల హత్యాచారం జరుగుతున్నప్పుడు.. శబ్దాలు ఎవరికి ఎందుకు వినిపించ లేదు? అన్నది ఒక ప్రశ్న. ఇదంతా చూస్తే.. సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోగా.. నేరం జరుగుతున్న వేళలో ఎవరూ లోపలకు వెళ్లకుండా ఉండేందుకు హాల్ బయట ఎవరైనా ఉన్నారా? ఈ కారణంగానే ఎవరికి తెలీకుండా మేనేజ్ చేశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

సెమినార్ హాల్ బయట ఎవరో ఉండి ఉంటారన్న అనుమానం..
ఈ కొత్త సందేహానికి సమాధానం కోసం సీసీ పుటేజ్ ను జల్లెడ వేస్తున్నారు. బాధితురాలిని చిత్ర హింసలకు గురి చేస్తున్న వేళలో.. సెమినార్ హాల్ లోపల నుంచి శబ్దాలు వినిపించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. డోర్ బోల్ట్ లేని విషయాన్ని జూనియర్ డాక్టర్లు.. సిబ్బంది తమకు చెప్పినట్లుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు. దీంతో.. హత్యాచార ఉదంతం జరిగిన ఇన్ని రోజుల తర్వాత.. సెమినార్ హాల్ డోర్ కు బోల్ట్ లేదన్న కీలక విషయం వెలుగు చూసింది. దీంతో.. సెమినార్ హాల్ బయట ఎవరో ఉండి ఉంటారన్న అనుమానం బలపడుతోంది.

ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చుట్టూ తిరిగినప్పటికీ.. ఇంకొందరు ఉన్నారన్న దానికి సరైన ఆధారం లభించని పరిస్థితి. ఇలాంటి వేళలో.. తెర మీదకు వచ్చిన బోల్ట్ వ్యవహారం విచారణలో కొత్త అంశాల మీద ఫోకస్ చేసేలా చేస్తుందని చెప్పాలి.

 

ట్రెండింగ్ వార్తలు