Moinabad Double Murder Case: మొయినాబాద్ జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్.. అప్పులు ఇచ్చిన 8మందిని చంపేందుకు ప్లాన్

కరీమా బేగం నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా..

  • Updated on- May 18, 2026 / 04:48 PM IST

Moinabad Double Murder Case: మొయినాబాద్ జంట హత్యల కేసులో తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరిని హత్య చేసిన కరీమా బేగం దంపతులు మరో ఆరుగురికి కూడా స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. అప్పులు తీసుకోవడం వాటిని ఎగ్గొట్టేందుకు ఫామ్ హౌస్ కు పిలిచి గుట్టు చప్పుడు కాకుండా మట్టుబెట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన 8 మందినీ చంపేందుకు కరీమా బేగం ప్లాన్ చేసింది. అంతేకాదు 8 మందిలో ఇద్దరిని హతమార్చింది. మరో ఆరుగురిని కూడా చంపేందుకు ఫామ్ హౌస్ కు పిలిచారు కరీమా బేగం దంపతులు.

కరీమా బేగం నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా.. అప్పు ఇచ్చిన వాళ్లనే చంపేస్తున్నారు కరీమా బేగం దంపతులు. ఈ వైనం సంచలనంగా మారింది. తాండూర్ పరిధిలో ఇద్దరు మహిళల నుంచి డబ్బులు తీసుకుని వారిని హత్య చేశారు. మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పి ఫామ్ హౌస్ కు పిలిపించి మహిళలను చంపేసింది కరీమా బేగం. తీసుకున్న అప్పులు ఎగ్గొట్టేందుకే కరీమా బేగం దంపతులు మర్డర్లు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

మొయినాబాద్ ఫామ్ హౌస్ సమీపంలో ఇద్దరు వృద్ధ మహిళలు అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పులు తీసుకుంటుంది. తర్వాత మీ అప్పు తీరుస్తాను అంటూ మొయినాబాద్ ఫామ్ హౌస్ కి పిలిపిస్తుంది. ఆమె మాట నమ్మి అక్కడికి వెళితే ఇక అంతే.. ప్రాణం పోవడం ఖాయం. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన ఇద్దరిని హతమార్చింది. మరో ఆరుగురు మహిళలను కూడా చంపేందుకు స్కెచ్ వేసింది. అయితే, వారంతా పోలీసులను ఆశ్రయించడంతో కరీమా బేగం క్రైమ్ బయటపడింది. ఈ కేసులో పోలీసులు అన్ని యాంగిల్స్ లో విచారణ జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే కరీమా బేగం బలవన్మరణానికి యత్నించడం కలకలం రేపింది.

Also Read: తెలంగాణలో దారుణ ఘటన.. అక్కను చంపిన తమ్ముడు.. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకొని..