Suryapet : తెలంగాణలో దారుణ ఘటన.. అక్కను చంపిన తమ్ముడు.. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకొని..
Suryapet : ఆస్తికోసం తమ్ముడు అక్కను హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకుంది.
Suryapet
Suryapet : ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం తుమ్మల పెన్పహాడ్లో మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో స్వగ్రామం (అమ్మగారి ఊరిలో) తన చెల్లెలు వద్ద సురుగి అంజమ్మ అనే మహిళ ఉంటుంది. తన మంచి చెడులు చూసుకోవడంతో తన పేరుమీద ఉన్న రెండు ఎకరాల భూమిని చెల్లెలుకు ఇచ్చేందుకు అంజమ్మ నిర్ణయం తీసుకుంది.
Also Read : Bandi Bhagirath Case : బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు..
అంజమ్మ నిర్ణయంతో ఆమె తమ్ముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనకు ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడు. అయితే, అంజమ్మ అందుకు ఒప్పుకోలేదు. తనకు ఉన్న రెండు ఎకరాలు తన చెల్లెలికే ఇస్తానంటూ చెప్పడంతో.. తనకు ఇవ్వకుండా చెల్లెలుకు భూమి ఇస్తా అంటుండడంతో తమ్ముడు అక్కపై కోపం పెంచున్నాడు.
అక్కను చంపితే ఆ ఆస్తి తనకు సొంతం అవుతుందనే దురుద్దేశంతో హత్య చేసినట్టుగా ప్రాథమిక సమాచారం. ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్తుండగా అంజమ్మపై వెనకనుండి వచ్చి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.
పదునైన కత్తితో పలుమార్లు దాడి చేయడంతో రక్తపు మడుగులో కొట్టుకుంటూ అంజమ్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
