Site icon 10TV Telugu

Bihar: ఆవు మాంసం తరలిస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తిపై భీకర దాడి, వ్యక్తి మృతి

US Woman

US Woman

Bihar: బిహార్ రాష్ట్రంలోని సివాన్ ప్రాంతంలో ఒక వ్యక్తిపై భీకర సామూహిక దాడి జరగడంతో ఆ వ్యక్తి మరణించాడు. సదరు బాధితుడు ఆవు మాంసం తరలిస్తున్నాడనే ఆరోపణతో ఈ దాడి జరిగింది. విపరీతంగా కొడుతూ బూతులు తిట్టారు. కాగా, దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సివాన్ జిల్లాలోని హసన్‭పూర్ గ్రామానికి చెందిన నసీం ఖురేషి (56) అనే వ్యక్తి తన తమ్ముడి కుమారుడు ఫిరోజ్ అహ్మద్ ఖురేషితో కలిసి మాంసం తీసుకెళ్తున్నారు. జోగియా గ్రామం వరకు వెళ్లగానే కొంతమంది వారిని అడ్డుకున్నారు.

Karnataka Polls: స్పీడు పెంచిన కాంగ్రెస్.. ఒకేసారి 190 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన?

వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ చూస్తుండగానే దారుణ రీతిలో దాడికి దిగారు. ఫిరోజ్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే నసీం ఆ మూకకు పూర్తిగా చిక్కిపోయారు. కర్రలతో నసీంను విపరీతంగా కొట్టారు. అనంతరం అదే మూక నసీంను పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న నసీంను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. నసీం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక సర్పంచ్ సుశీల్ సింగ్ సహా రవి షా, ఉజ్వల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నసీం నిజంగానే ఆవు మాంసాన్ని రవాణా చేస్తున్నాడా అనే విషయం మీద కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

MLA Rajaiah Vs Women Sarpanch : మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

Exit mobile version