మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ పై వేటు పడింది. పార్టీ నుంచి ఆశిష్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్
మద్యం మత్తులో నటితో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ పై వేటు పడింది. పార్టీ నుంచి ఆశిష్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. మద్యం మత్తులో బిగ్ బాస్-2 ఫేమ్, నటి సంజనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆశిష్ గౌడ్ పై నిర్భయ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆశిష్ గౌడ్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ బీజేపీ అధిష్టానం.. ఆశిష్ గౌడ్ పై చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
నోవాటెల్ హోటల్ లోని పబ్ లో నందీశ్వర్ గౌడ్ నటి సంజనతో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న ఆశిష్ గౌడ్ రెచ్చిపోయాడు. సంజన చేయి లాగాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. దీనిపై సంజన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆశిష్ గౌడ్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.
శనివారం(నవంబర్ 30,2019) అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని, బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని సంజన ఆరోపించింది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని సంజన తెలిపింది. ఆశిష్ వేధింపులతో భయభ్రాంతులకు గురయ్యానని వాపోయింది. ఎలాగో అతడి బారి నుంచి తప్పించుకున్నట్టు చెప్పింది.