illegal affair with married woman : 35 ఏళ్ల వివాహితతో 23 ఏళ్ల యువకుడి ప్రేమాయణం… బయటపడే సరికి…..

Bangalore Illegal Affiar

illegal affair with married woman : 35 ఏళ్ల వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడో 23 ఏళ్ల యువకుడు. ఆవిషయం తెలిసిన ఆమె ఇంటి చుట్టు పక్కలవారు అతడ్ని బ్లాక్ మెయిల్ చేయసాగారు.వారు అడిగినంత డబ్బు ఇచ్చినప్పటికీ వారి వేధింపులు ఆగకపోయేసరికి ఆయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

బెంగుళూరులో నివసించే యతీశ్(23) అనే యువకుడు గత కొంతకాలంగా వివాహిత(35) మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ భర్త  నిత్యం  మద్యం సేవించి వచ్చి మహిళను హింసించసాగాడు.  ఆపరిస్ధితుల్లో యతీశ్ మహిళకు అండగా నిలిచాడు.

ఆమెను భర్త పెట్టే వేధింపులు బారినుంచి రక్షించాడు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ మహిళ తన భర్తనుంచి విడిపోయి వేరుగా జీవించసాగింది.

దీంతో వీరి మధ్య అక్రమ సంబంధం మరింత బలపడింది. యతీశ్ ఆమె ఇంటికి రాకపోకలు నిరంతరాయం చేయసాగాడు. వీరి వ్యవహారాన్ని గమనించిన మహిళ ఇంటి చుట్టుపక్కల ఉన్న రామచంద్ర, చేతన్, తేజ అనే ముగ్గురు వ్యక్తులు యతీశ్ ను బ్లాక్ మెయిల్   చేయటం ప్రారంభించారు.

మీ ఇద్దరి వ్యవహారం మాకు తెలుసు. నువ్వుమాకు డబ్బులు  ఇవ్వకపోతే అందరికీ చెప్పి నీ పరువు తీస్తాం అంటూ బెదిరించ సాగారు. దీంతో యతీశ్ వాళ్లకు డబ్బులివ్వటం మొదలెట్టాడు.

ఈక్రమంలో తన వద్ద ఉన్న బుల్లెట్ మోటారు సైకిల్ ను, సెల్ ఫోన్ ను ….ఇతర  విలువైన వస్తువులను అమ్మేసి వారికి డబ్బులు ఇచ్చాడు. అనతంరం మహిళతో సంబంధం కొనసాగుతూనే ఉంది.

ఆ యువకులు మళ్లీ యతీశ్ ను డబ్బులు డిమాండ్ చేయటం మొదలెట్టారు. వీరి బెదిరింపులు తట్టుకోలేని యతీశ్ డిప్రెషన్ కు లోనయ్యాడు. ఈక్రమంలో శనివారం మార్చి 27 ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా బాధితుడి సోదరి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత మహిళ ప్రోద్బలంతోనే ముగ్గురు యువకులు డబ్బులు డిమాండ్ చేశారని గాయత్రి తన ఫిర్యాదులో ఆరోపించింది. తన తమ్ముడి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకు మహిళ పన్నిన కుట్రగా ఆమె తెలిపారు.

ఆవిషయాన్ని తన సోదరుడు ఆలస్యంగా గుర్తించాడని…చివరికి తాను చేసిన పొరపాటుకు బాధపడి కుమిలిపోయి డిప్రెషన్ కు లోనయ్యాడని చెప్పింది. తన సోదరుడి మరణానికి కారణమైన మహిళతో సహా ముగ్గురు యువకులపై చర్యలు తీసుకోవాలని గాయత్రి పోలీసులను కోరింది.