రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు 

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో పేలుడు కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది.

  • Publish Date - March 14, 2020 / 05:59 AM IST

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో పేలుడు కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది.

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో పేలుడు కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో భారీ శబ్దం వచ్చింది. పేలుడు తీవ్రతకు స్థానిక ఇళ్ల అద్దాలు, సామాన్లు ధ్వంసం అయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణమేంటన్నదానిపై ఆరా తీస్తున్నారు. 

శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పెద్ద డస్ట్ బిన్ ఉంది. స్థానికంగా నివాసముండేవారు అందులో చెత్త వేస్తుంటారు. చెత్తను డంపింగ్ చేస్తున్నప్పుడు నిప్పు పెట్టడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయందోళనకు గురయ్యారు. 

డస్ట్ బిన్ లో కెమికల్ బాక్స్  బ్లాస్ట్ అవ్వడంతో జరిగిందా లేదా పేలుడుకు జరుగడానికి గల వస్తువులు ఏమున్నాయని పోలీసులు నిర్ధారించాల్సివుంది. క్లూస్ టీమ్ తోపాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా అక్కడకు చేరుకున్నారు. మైలార్ దేవుపల్లి పోలీసులతోపాటు రాజేంద్రనగర్ పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
 

Also Read | BECIL లో 4 వేల ఉద్యోగాలు: దరఖాస్తు గడువు పొడిగింపు