ఇద్దరు మైనర్ అమ్మాయిల ఆత్మహత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మావ్ తెహ్‌సిల్ మండలంలోని కటయ్య కాదర్ గ్రామంకు దగ్గరలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాధమిక విచారణ అనంతరం చిత్రకూట్ సబ్ సూపరినెంట్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కటయ్య కాదర్ గ్రామంకు చెందిన ఇద్దరు యువతులు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఉరి వేసుకునేందుకు తాళ్లను తీసుకుని బయలుదేరారని, అనంతరం3గంటల నుంచి 4గంటల మధ్యలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు వెల్లడించారు. గ్రామానికి 500మీటర్ల దూరంలో వెళ్లి వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
అమ్మాయిల బాడీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. పోస్ట్ మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. జరిగిన ఘటనపై మృతుల కుటుంబాలతో మాట్లాడిన పోలీసులు.. వారు ఏమీ చెప్పట్లేదని చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియవలసి ఉంది.