Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. పదకొండేళ్ల బాలుడిని జైన దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న సిద్ధయతన్ జైన దేవాలయంలో ఈ ఘటన జరిగింది.
Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్
ఈ ఘటనను అక్కడి వారెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జైన దేవాలయంలోని ఒక పూజారి, మరో యువకుడు కలిసి బాలుడిని పట్టుకుని కొడుతున్నారు. బాలుడ్ని చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. దీంతో బాలుడు ఏడుస్తూ విలపించాడు. ఈ దృశ్యాన్ని చూసి, ఇద్దరు వ్యక్తులు అడ్డుకునేందుకు వచ్చారు. కానీ, వారిని కూడా ఆ పూజారి బెదిరించి పంపించి వేశాడు.
Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి.. నదిలో ఈదుకుంటూ వెళ్లిన యువతి.. వీడియో వైరల్
ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు మోతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధాన నిందితుడిని రాకేష్ జైన్‌గా గుర్తించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
कहते हैं बच्चे भगवान का रूप होते हैं लेकिन मध्य प्रदेश के सागर में बच्चों के साथ किए जा रहे व्यवहार का एक अलग ही रूप देखने को मिल रहा है.. यहां एक बच्चे को रस्सी से बांधकर पीटा गया.@MPDial100@DGP_MP#MadhyaPradesh #sagar #SocialJustice pic.twitter.com/xdFxnr9lyH
— Shalini Singh (@shalinisengar23) September 10, 2022