Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

సఫారికి వెళ్లిన టూరిస్టులకు భయానక పరిస్థితి ఎదురైంది. ఒక పెద్ద ఏనుగు వారి జీప్‌ను తరిమింది. జీప్ ఎదురుగా ఉన్న ఏనుగు వెంట పడటంతో డ్రైవర్ రివర్స్‌లో వేగంగా వెనక్కు తీసుకెళ్లాడు.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

Viral Video: జంగిల్ సఫారి సందర్శకులకు ఉత్సాహాన్నిస్తుంది. జీప్ లేదా స్పెషల్ వాహనాల్లో అడవుల్లో తిరుగుతూ, అటవీ మృగాలను దగ్గరి నుంచి చూడటం సంతోషాన్నిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది ప్రమాదకరంగా కూడా మారవచ్చు.

BiggBoss 6 Day 5 : మొత్తానికి ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్య.. వరస్ట్ పర్ఫార్మర్ గీతూ.. అనుకున్నదే అయిందిగా..

సఫారీల్లో కొన్నిసార్లు అటవీ జంతువులు సందర్శకులు, గార్డులపై దాడికి దిగుతుంటాయి. తాజాగా కర్ణాటకలోని కబిని అటవీ ప్రాంతంలో టూరిస్టుల సఫారిపై జీప్ పైకి ఒక ఏనుగు దూసుకొచ్చింది. ఏనుగు తరమడంతో జీప్‌లోని టూరిస్టులు వణికిపోయారు. వెంటనే జీప్ డ్రైవర్ అప్రమత్తమై ఏనుగుకు దొరకకుండా రివర్స్‌లో వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. అయినా, ఏనుగు కొద్దిసేపు ఆ జీప్‌ను వెంటాడింది. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా పక్కకు వెళ్లిపోయింది. దీంతో జీప్‌లో ఉన్న పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్.. ఆమెను అలా చూసి షాక్ అవుతున్న నెటిజెన్లు!

ఒకవేళ జీప్ వేగంగా వెనక్కు వెళ్లకుండా ఉంటే ఏనుగు విధ్వంసమే సృష్టించేది. ఈ ఘటనకు సంబంధించి జీప్‌లోని సందర్శకుల్లో ఒకరు వీడియో తీశారు. దీన్ని సుప్రియా సాహు అనే ఐఏఎస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.