రెండేళ్లుగా చెల్లిపై అన్న అత్యాచారం : తెలంగాణలో మరో ఘోరం

అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఫ్రెండ్ తో కలిసి ఈ

  • Publish Date - December 29, 2019 / 07:59 AM IST

అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఫ్రెండ్ తో కలిసి ఈ

అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఫ్రెండ్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. చివరికి యువతి గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ లో ఈ ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు.. చెల్లెలి వరుసయ్యే చిన్నాన్న కూతురుపై రెండేళ్లుగా స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బీటీనగర్‌కు చెందిన యువతి (19) దివ్యాంగురాలు. 10వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటోంది. తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్తారు. యువతి ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆమె పెదనాన్న కొడుకు నవీన్‌(25), స్నేహితుడు రవి(22) రోజూ వెళ్లి ఆమెను వేధించేవారు. రెండేళ్ల క్రితం ఆమెను బెదిరించి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆ కామాంధులిద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు నోరు విప్పలేదు. ఇటీవల ఆమె శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని నిలదీయగా జరిగిన విషయం చెప్పింది.

దీంతో వైద్య పరీక్షలు చేయించగా 5 నెలల గర్భిణి అని తేలింది. ఏం చేయాలో తెలీక తల్లిదండ్రులు కుల పెద్దలను ఆశ్రయించగా ఈ విషయం బయటకు రాకుండా వారు అడ్డుకున్నారు. దీంతో బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సాయంతో శనివారం(డిసెంబర్ 29,2019) బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. 

Also Read : అసలేం జరిగింది : ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య