Pragathi Bhavan : ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ములు ఆత్మాహత్యాయత్నం

సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం కలకలం రేపింది. 

Brothers Attempt Suicide At Cm Camp Office

Pragathi Bhavan :  సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద మంగళవారం  అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది.  ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ప్రగతి భవన్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే వారి యత్నాన్ని అడ్డుకుని రక్షించారు.

పేట్‌బషీర్‌బాగ్ సీఐ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఇద్దరు అన్నదమ్ములు మంగళవారం ప్రగతి భవన్ వద్ద ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, మరోకరు మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌కు అడ్డంగా పడిపోయి అత్మాహత్యాయత్నం చేశారు. ఇంటి నిర్మాణం విషయంలో బిల్డర్ తో కుమ్మక్కైన  సీఐ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ వారిద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈవిషయమై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.  సమాచారం తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ ప్రగతి భవన్ వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు.