అనంతపురంలో బస్సు బోల్తా : మహిళ మృతి

  • Publish Date - December 1, 2019 / 02:31 AM IST

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం లోని తపోవనం కూడలి వద్ద ఆదివారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో 7 గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈప్రమాదంలో మరణించిన మహిళను రాజస్ధాన్ లోని జైపూర్ కు చెందిన  సుచిత్ర(38) గా గుర్తించారు.

డ్రైవర్  అతివేగంగా, నిర్లక్ష్యంగా  బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అనంచతపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు.