Thailand : చెట్టును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. 14మంది దుర్మరణం
అదుపుతప్పిన ఓ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.
- nagamani
- Published on- December 5, 2023 / 12:32 PM IST
Thailand Bus accident
Thailand Bus accident : అదుపుతప్పిన ఓ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. థాయ్‌లాండ్‌లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో సోమవారం (డిసెంబర్ 4,2023)అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో 14మంది చనిపోగా మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు చెట్టును ఢీకొనటంతో బస్సు రెండుగా చీలిపోయింది. బస్సు తీవ్రంగా ధ్వంసం కావటంతో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీయటానికి రెస్క్యూ టీమ్ చాలా శ్రమపడ్డారు.
ప్రమాద తీవ్రత వల్ల బస్సు రెండుగా చీలిపోయిందని రాష్ట్ర ప్రసార సంస్థ థాయ్‌పిబిఎస్‌ని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
