Call Girl Scam : మీ ఫోన్లకు ఇలా మెసేజ్‌లు వస్తున్నాయా? కాల్ గ్లర్స్ కావొచ్చు.. జాగ్రత్త..!

Call Girl Scam : మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? కాల్ చేస్తే అమ్మాయి అందమైన వాయిస్ వినిపిస్తుందా? వలపు బాణాలను విసురుతూ మత్తెక్కించే మాటలతో కవ్విస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..

Call Girl Scam : మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? కాల్ చేస్తే అమ్మాయి అందమైన వాయిస్ వినిపిస్తుందా? వలపు బాణాలను విసురుతూ మత్తెక్కించే మాటలతో కవ్విస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. వారిబుట్టలో పడొద్దు.. వారంతా ఫేక్.. కేవలం మీ దగ్గర నుంచి డబ్బులు దోచేయడానికి మాత్రమే వలపు గాలం వేస్తున్నారని మరువొద్దు.. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అందుకే సైబర్ క్రైమ్ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి తమతో మాట్లాడాలంటూ ఏదైనా మెసేజ్ లను పంపితే వాటిని అసలు రెస్పాండ్ కావొద్దని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. కోల్ కతా కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు యువకులను ఆకర్షించేందుకు అమ్మాయిలతో మెసేజ్ లు పంపిస్తున్నారు. ఫోన్ కాల్స్ లో మాట్లాడిస్తున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేసేస్తారు జాగ్రత్త అంటూ సైబర్ క్రైమ్ హెచ్చరిస్తోంది. చాలామంది తమ ఫోన్లకు వచ్చిన ఫోన్‌నంబర్లతో మాట్లాడి రూ.లక్షలు నగదును కోల్పోయారు. చివరికి తాము మోసపోయామని గ్రహించి సైబర్‌ క్రైమ్‌పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Call Girl Scam Don’t Respond To These Messages From Call Girl Frauds, Be Careful 

మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు, వాట్సాప్‌ నంబర్‌కు ఫొటోలు వస్తున్నాయా? ఇది సైబర్ నేరగాళ్ల పనే.. అమాయకులను మోసం చేసేందుకు మోసగాళ్లు భారీ నెట్‌వర్క్‌ ఉపయోగిస్తున్నారు. రోజుకు వెయ్యిమందికి మెసేజ్ లు పంపుతున్నారు. ఆ మెసేజ్‌లకు స్పందించి ఫోన్లో మాట్లాడిన వారికి అందమైన యువతలను టెలికాలర్లుగా మాట్లాడిస్తున్నారు. ఫోన్ చేసిన వారితో మాటలు కలపడం, తమను కలుస్తారా? అని అడగడం, ఇద్దరం కలిసి రెస్టారెంటులో భోజనం చేద్దామంటూ కబుర్లు చెప్పి బుట్టలో పడేస్తుంటారు. అమ్మాయిల మాటలకు పడిపోయి ఎవరైనా సరే అంటే.. వెంటనే రూ. 10వేలు మెంబర్ షిప్ చెల్లించాలని కండీషన్ పెడుతున్నారు. అలా అయితేనే కంటిన్యూ చేస్తున్నారు. అలా రూ.10వేలు పంపగానే.. వీడియో కాల్ చేస్తున్నారు. వారిని మరింతగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా రెస్టారెంటుకు వెళ్దామా.. నాకు మనీ పంపండి.. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. వారి మాటలు నమ్మి డబ్బులు పంపగానే మాట్లాడటం మానేస్తున్నారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు.

కాల్ గ్లర్స్ వలలో చిక్కిన ఓ యువకుడు.. ఇలానే నమ్మి రూ.1.10 లక్షల నగదును ట్రాన్స్ ఫర్ చేశాడు. అమ్మాయి రమ్మని చెప్పిన ప్లేసుకు వెళ్లి చూస్తే ఆమె అక్కడ లేదు. దాంతో అతడు తాను మోసపోయినట్టు గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో.. మూడు ఫోన్లతో పోలీసులు ఆ ఫోన్ నెంబర్లతో మాట్లాడారు. ఆ అమ్మాయి నంబర్‌కు ఫోన్‌ చేయగా.. తాను సికింద్రాబాద్‌లో ఉన్నానని చెప్పింది. తాను వెంటనే వచ్చి మెంబర్ షిప్ పేమెంట్ చేసేస్తానని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. మరో అమ్మాయి నెంబర్ కు ఫోన్ చేస్తే.. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఆ ఫోన్ నెంబర్లను ట్రేస్ చేయగా కోల్‌కతాలోనివిగా పోలీసులు గుర్తించారు.

Read Also : High Court : బిగ్‌బాస్‌ లాంటి అభ్యంతరకర షోలు సమాజానికి ప్రమాదకరం

ట్రెండింగ్ వార్తలు