×
Ad

Road Accident : రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా-ఎస్సై భార్య మృతి

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం వద్ద ఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది.

  • Published On : November 14, 2021 / 04:27 PM IST

Road Accident

Road Accident : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం వద్ద ఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి వెళుతున్న ఓ కారు బోల్తాపడిన ఘటనలో మహిళ మృతి చెందింది.

విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్ (సీసీఎస్) లో ఎస్సై గా పని చేస్తున్న కోడూరు సత్యనారాయణ ఆదివారం ఉదయం కారులో విజయవాడ  నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి  దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు.  తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్దకు చేరుకున్న సమయంలో కుక్క ఒకటి రోడ్డుకు అడ్డంగా  వచ్చింది.

Also Read : Morphed Photos, Videos : అశ్లీల మార్ఫింగ్ వీడియోలతో మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఫేస్‌బుక్ స్నేహితురాలు

దాన్నితప్పించబోయి కారు అదుపుతప్పిపక్కన ఉన్న పంటపోలాల్లోకి పల్టీలు కొట్టింది. ఈఘటనలో కారులో ఉన్న ఎస్సై భార్య సరోజ అక్కడి కక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన మిగతా కుటుంబ సభ్యులను 108 అంబులెన్స్ లో రాజమండ్రిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Si K.satyanarayana His Wife Saroja