రెచ్చిపోయిన చెడ్డీగ్యాంగ్‌ : వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారం, రూ. 50 వేలు దోచుకెళ్లారు

  • Publish Date - October 25, 2019 / 04:22 PM IST

హైదరాబాద్ హయత్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్‌ బీభత్సం సృష్టించారు. కుంట్లూరు గ్రామ శివారులోని యగ్నికపీఠం వేదపాఠశాలలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. కిశోర్‌స్వామి అనే వ్యక్తిని కట్టేసి 11తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దోచుకున్నారు.

ఆరుగురు దుండగులు ఇనుప రాడ్లతో వచ్చి బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చెడ్డీగ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు.