చింతమనేని వీడియో ఎఫెక్ట్ : కొత్త పెళ్లి కొడుకు అరెస్టు

  • Publish Date - February 23, 2019 / 04:08 PM IST

ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను వైరల్ చేశాడనే కారణంతో  శ్రీరామవరంకు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి నాని అనే వ్యక్తిని  పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు.  అతడ్ని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి.

శుక్రవారం కామిరెడ్డి నాని వివాహం  జరిగింది. భార్యతో కలిసి నాని అత్తవారి ఇంటికి వెళ్తుండగా  పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో నాని బంధువులు, వైసీపీ నాయకులు 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు.