CI Raju Caught : ఏకంగా కారులోనే సీఐ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్న భార్య, పిల్లలు

CI Raju, CI Raju Illegal Affair, Caught Red Handedly, Hyderabad CI

CI Raju Caught : హైదరాబాద్ లో మరో సీఐ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. సీఐ రాజు వివాహేతర సంబంధాన్ని భార్య రట్టు చేసింది. వేరే మహిళతో కారులో సన్నిహితంగా ఉన్న సీఐ రాజును.. అతడి భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీఐ రాజు రాసలీలల గురించి అతడి భార్య పెట్రోలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు దగ్గరకి చేరుకున్న పోలీసులపై సీఐ రాజు దాడి చేశాడు. తాను సీఐనంటూ దాడికి దిగాడు.

ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ఎస్బీ విభాగంలో రాజు సీఐగా పని చేస్తున్నాడు. మునుగోడు ఉపఎన్నిక విధులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఐ రాజుకి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో వనస్థలిపురంలో ఆ మహిళతో కారులో ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకున్న భార్య.. అక్కడికి వెళ్లి భర్తతో గొడవ పెట్టుకుంది. అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులతో రాజు గొడవకు దిగాడు. తాను సీఐ అంటూ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు సీఐ రాజును అరెస్ట్ చేశారు. సీఐ పై కేసు నమోదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఐ రాజు భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది.

ఇక, ఇటీవలే వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో మారేడ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును తెలంగాణ పోలీస్ శాఖ సర్వీస్ నుంచి పూర్తిగా తొలిగించింది. ఇలా.. నేరారోపణలు ఉన్న హైదరాబాద్ పరిధిలోని 39 మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళపై అత్యాచారం కేసులో నాగేశ్వరరావు నేరం ఒప్పుకోగా.. పోలీస్ ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. కాగా.. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున నాగేశ్వరరావును సర్వీస్ నుంచి పూర్తిగా తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరువక ముందే మరో ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం వెలుగులోకి రావడం డిపార్ట్ మెంట్ లో కలకలం రేపింది. తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే తప్పుడు పనులు చేసి అడ్డంగా బుక్కవుతున్నారు. డిపార్ట్ మెంట్ పరువు తీస్తున్నారని పోలీసులు వాపోతున్నారు.