వైఎస్ వివేకా హత్య కేసు: సీఐ సస్పండ్

  • Publish Date - March 22, 2019 / 03:21 AM IST

మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసు విషయంలో ఆధారాలు సేకరించలేకపోయిన కారణంగా పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఆధారాలు కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీఐ శంకరయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. డీఐజీ నాగేంద్రకుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకలను కడగడం వల్ల కీలక ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గాయని పోలీసుశాఖ భావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అవినాష్ రెడ్డి తీరు పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  అనుమానాస్పద మృతిగా వైఎస్ వివేకా మరణంను మొదట గుర్తించగా.. తర్వాత ఆయనది హత్య అని తేలిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై సిట్ విచారణ జరుగుతుంది.