Tripura: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి గంట కూడా కాకముందే త్రిపురలో అల్లర్లు

పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్‌బజార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆ ప్రాంతంలో ఉండటంతో క్షతగాత్రులు ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ చెప్పారు

Tripura: త్రిపుర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన గంట కూడా కాలేదు. అంతలోనే ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన అరగంటకే అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు కుమ్ములాటకు దిగారు. బాగా కొట్టుకోవడంతో ఇరు వర్గాలవారు గాయపడ్డారు. మజలిస్‌పుర నియోజకవర్గంలోని రనిర్‌బజార్ మెహన్‌పూర్‌లో జరిగిందీ ఘర్షణ.

UP: యూపీలో ముస్లిం సమాజం ఎస్పీ నుంచి బీఎస్పీ వైపుకు వెళ్తోందా?

పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్‌బజార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆ ప్రాంతంలో ఉండటంతో క్షతగాత్రులు ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ చెప్పారు. విపక్షాలపై దాడి వెనుక ఒక మంత్రి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. మజ్‌లిస్‌పూర్ నియోజకవర్గంతో సహా ఐదు నియోజకవర్గాల్లో వేరుగా ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Assembly Election: ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీ బలమెంతంటే?

ట్రెండింగ్ వార్తలు