కోసిపడెయ్యాలి : 7వ తరగతి బాలికపై 30మంది అత్యాచారం

కేరళలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 30మంది రేప్ కు పాల్పడ్డారు. రెండేళ్లుగా తనపై 30మందికి పైగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. అయితే తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసునని వ్యభిచార వ్యాపారంలోకి తన తండ్రే తనను నెట్టాడని బాలిక భోరున విలపించింది.

కేరళలలోని మలప్పురం జిల్లాలో 12ఏళ్ల బాలిక ఏడవ తరగతి చదువుతోంది. అయితే చిన్నారి ఇంట్లో ఏదో జరుగుతందని అనుమానపడిని అదే ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్ధులు బాధిత బాలిక స్కూల్ కి చెందిన పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్(PTA)కి కంప్లెయింట్ చేశారు. దీంతో బాలికను టీచర్లు దగ్గరగా గమనించడం మొదలుపెట్టారు. ఎక్కువ రోజులు బాలిక స్కూల్ కి సెలవు పెడుతున్నట్లు,ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నట్లు గమనించారు. బాలికకు ఏదో మానసిక సమస్య ఉందని భావించిన టీచర్లు చైల్డ్ లైన్ కి సమాచారమందించారు.

స్కూల్ టీచర్ల వినతి మేరకు చైల్డ్ లైన్ అధికారులు ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో సంచలన,ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తల్లిదండ్రులకు తెలిసే తనపై చాలామంది అత్యాచారానికి పాల్పడ్డారని,లైంగికంగా వేధించారని,తన తండ్రి స్నేహితులు కూడా చాలా మంది తనపై అత్యాచారం చేశారని తెలిపింది. ఆర్థికపరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు ఆ బాలికను సెక్స్ వ్యాపారంలోకి బలవంతంగా నెట్టారని చైల్డ్ లైన్ అధికారులకు సమాచారమందింది. 

అయితే తనను వేధించినవారిలో ఇద్దరి పేర్లను మాత్రమే బాధిత బాలిక చెప్పడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. చిన్నారి చైల్డ్ వెల్ఫేర్ షెల్టర్ హోమ్ కి తరలించబడిందని,ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.