ఉల్లిపాయలు లేవన్నాడని…వేలు కొరికేశాడు

దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి కళ్లల్లో ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధరలతో విసిగిపోయిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రయదారులపై వారి కోపాన్ని చూపిస్తున్నారు. ఉల్లిపాయలు లేవని ఓ యువకుడు ఉల్లిపాయలు విక్రయిస్తున్న సేవాదళ్​ సభ్యుడి వేలును కొరికేసిన ఘటన ఉత్తరాఖండ్​ రాష్ట్రంలోని హల్​ద్వానిలో జరిగింది.

ఉల్లి ధరలు పెరగటం వల్ల జిల్లాలోని హల్ద్వానిలో కాంగ్రెస్​ సేవాదళ్​ ఆధ్వర్యంలో ఉల్లిపాయల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఓ యువకుడు స్టాల్​ దగ్గరకు వెళ్లాడు. అయితే అప్పటికే ఉల్లిపాయలు అయిపోయాయని విక్రయదారులు చేప్పారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తి చేసిన ఆ యువకుడు అక్కడ హల్​చల్​ సృష్టించాడు. స్టాల్​లో ఉన్న కాంగ్రెస్​ సేవాదళ్​ సభ్యుడి వేలును కొరికేశాడు. వేలు తెగి కిందపడిపోయింది.ఆ యువకుడిని సేవదళ్​ సభ్యులు పట్టుకుని చితకబాదారు. అతను బీజేపీకి చెందిన వ్యక్తిగా ఆరోపించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.