రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రం, బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్‌పీఎఫ్ జవాను మృతి చెందాడు.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో గిరిదీహ్ జిల్లా బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో CRPF 7వ బెటాలియన్ కు చెందిన జవాన్లు గాలింపుచర్యలు చేపట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు పోలీసుల పైకి కాల్పులు జరిపారు. దీంతో అప్రమ్తతమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ముగ్గురు మావోయిస్టులుతో పాటు ఒక జవాను మరణించాడు. మరోక జవాను గాయపడ్డాడు. రాష్ట్ర రాజధాని రాంచీ నుంచి 185 కిలోమీటర్ల దూరంలో గిరిదీహ్ ప్రాంతం ఉంది.
ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, నాలుగు పైప్ బాంబులకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 29న నాలుగో విడతలో జార్ఖండ్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.