హత్య? ఆత్మహత్య?: రైల్వే ట్రాక్ పై మృతదేహాలు

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు

  • Publish Date - October 15, 2019 / 06:37 AM IST

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. 4 మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీరిది ఆత్మహత్య, హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వేరే ప్రాంతంలో ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి ట్రాక్ పై పడేశారా? అన్న కోణంలోనూ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 3 చోట్ల వీటిని గుర్తించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.