మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లాలోని రామ్‌గఢ్‌లో సోమవారం(జనవరి 29,2019) రాత్రి రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనాలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.