మే 24 వరకు.. యాసిన్ మాలిక్‌కు జ్యుడిషియల్ కస్టడీ

కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఢిల్లీ పటియాలా కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. మే 24వరకు మాలిక్ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు బుధవారం (ఏప్రిల్ 24, 2019) కోర్టు పేర్కొంది.

  • Publish Date - April 24, 2019 / 12:34 PM IST

కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఢిల్లీ పటియాలా కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. మే 24వరకు మాలిక్ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు బుధవారం (ఏప్రిల్ 24, 2019) కోర్టు పేర్కొంది.

కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఢిల్లీ పటియాలా కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. మే 24వరకు మాలిక్ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు బుధవారం (ఏప్రిల్ 24, 2019) కోర్టు పేర్కొంది. 2017 ఉగ్రవాదులకు నిధులు, కుట్ర కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలతో మాలిక్ ను NIA ఏజెన్సీ అరెస్ట్ చేశారు. అనంతరం స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా.. ఏప్రిల్ 22 వరకు కస్టడీ విధించింది.

భద్రత కారణాల దృష్ట్యా.. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF)నేత మాలిక్ ను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హాజరుపరిచేందుకు తిహార్ జైలు అధికారులు కోర్టు నుంచి ఆదేశాలు కోరుతూ దరఖాస్తు చేశారు. దీనిపై డిఫెన్స్ కౌన్సిల్ స్పందించాల్సిందిగా కోర్టు సూచించింది. మాలిక్ అరెస్ట్ అయిన కొన్ని వారాలకే కేంద్ర ప్రభుత్వం JKLFపై నిషేధం విధించింది.