కొందరు పెద్దల మూర్ఖత్వం ఒక యువతి నిండు ప్రాణాన్నిబలిగొంది. మనుషుల ప్రాణాల కంటే సమాజంలో పరువే ముఖ్యంగా బతుకుతున్నారు. కన్న బిడ్డలపై ప్రేమ కంటే కులం,మతం, ఆస్తి, అంతస్తులపై ప్రజలకు మమకారం పెరిగిపోతోంది, సమాజం మారుతున్నా…. హైటెక్ యుగంలోకి పరుగెడుతున్నా పెద్దల ఆలోచనల్లో మార్పు రాకపోవటంతో చిన్నారుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.
ఒకే గోత్రం ఉన్న యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో కన్న కూతుర్ని దారుణంగా హత్య చేసింది ఢిల్లీలోని ఒక కుటుంబం. ఇంత వరకు పరువు హత్యలు చూశాం… పెద్దలకు నచ్చలేదని ప్రేమ వివాహాం చేసుకున్నందుకు హత్యలు చేసిన ఘటనలు చూశాం…కులం, మతం, ఆస్తి అంతస్తు కారణాల పిల్లల గొంతుకోసినఘటనలు చూశాం ..ఇప్పడు ఒకే కులంలోని ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని చేసుకున్నందుకు తల్లితండ్రుల చేతుల్లో తనువు చాలించిందో యువతి.
తూర్పు ఢిల్లీలో శీతల్ చౌదరి (25) అంకిత్ అనే యువతీ యువకులు 2016 నుంచి ప్రేమించికుంటున్నారు. ఇద్దరివీ పక్కపక్కఇళ్లే కావటంతో ఇంట్లో వాళ్లకు తెలీయకుండా 2019 ,అక్టోబరులో ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరు వారి వారి కుటుంబాలతోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. శీతల్ చౌదరి కుంటుబం పాల వ్యాపారం చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 20న శీతల్ తాను పెళ్లిచేసుకున్నసంగతి తల్లి తండ్రులకు చెప్పింది. వరుడు అంకిత్ అని తెలిసే సరికి ఇంట్లోవారు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వారం ఓపిక పట్టారు. ఈలోపు ఇంట్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చివరికి జనవరి 29న కన్న కూతురుని గొంతుకోసి చంపేశారు, మృతదేహాన్ని కారులో పెట్టుకుని అక్కడికి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్నఉత్తర ప్రదేశ్ లోని సికింద్రాబాద్ చేరుకుని అక్కడ కాలువలో మృతదేహాన్ని పడేసి వెళ్ళి పోయారు.
ఇదంతా తెలియని అంకిత్ కొన్నిరోజులుగా భార్య కనిపించక పోవటంతో ఫిబ్రవరి 18న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదులో తన అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశాడు. మరోవైపు జనవరి 20న ఉత్తర ప్రదేశ్ పోలీసులు అలీఘడ్ కాలువలలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అంకిత్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణలో భాగంగా అంకిత్ ను తీసుకు వెళ్ళి మృతదేహాం ఫోటోలు చూపించారు.
అంకిత్…..శీతల్ మృతదేహాన్ని గుర్తుపట్టటంతో పోలీసులుఅతడి అత్తమామలను అదుపులోకి తీసుకుని తమ దైన స్టైల్లో విచారించారు. దీంతో నేరానికి సహకారించిన అందరినవీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి తల్లిదండ్రులు రవీందర్ చౌదరి, సుమన్, మామయ్య సంజయ్, బంధువులు ఓమ్ ప్రకాశ్, అంకిత్, పర్వేశ్‌లను అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు వారిని ప్రశ్నించగా…. ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకే హతమార్చినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు.