ఢిల్లీలో దారుణం జరిగింది నోయిడాలోని హాస్టల్ లో ఓ విద్యార్ధిని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా పరిచయమే యువతి అత్మహత్యకు కారణమైంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రనికి చెందిన స్వాతి సాహ్నిగా (21) ఢిల్లీ యూనివర్సిటిలో LLB చదువుతోంది. కొన్ని రోజుల క్రితం స్వాతీకి ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రోజు ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. అయితే కోన్ని రోజులుగా విరి మధ్య మనస్పర్థల కారణంగా మాటలు లేకుండా పోయాయి. ఈ సమయంలో అదివారం రాత్రి ఆ యువకుడికి ఫోన్ చేసినప్పుడు మెసేజ్ లకు ఎందుకు రిప్లై ఇవ్వటం లేదని స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో స్వాతి క్షనికావేశంలో తన రూమ్ లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు మృతి దేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత బాడీని యువతి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు స్థానిక పోలీస్ అధికారి మనోజ్ కుమార్ పంత్ తెలిపారు. ఇప్పటి వరకు యువతి తల్లిదండ్రులు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని తెలిపారు.