భారత్‌కు చెందిన 13లక్షల మంది డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు హ్యాకింగ్ గురయ్యాయి. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం విలువ రూ.922కోట్లుగా ఉంది. వీటిని హ్యాక్ చేసి అమ్మకానికి పెట్టారు. ఒక్కో కార్డుని రూ.7వేలకు విక్రయించేందుకు డార్క్ వెబ్‌లోని జోకర్స్ స్టాష్‌లో ఉంచారు. కార్డుల్లో ఉండే చిప్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. దానిని ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ల ద్వారా సేకరించి ఉండొచ్చని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
సింగపూర్‌కు చెందిన గ్రూప్-ఐబి భద్రతా పరిశోధన బృందం వివరాలను వెల్లడించింది. దీనిని భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద హ్యాక్‌గా చెబుతున్నారు. మరో షాకింగ్ ఏంటంటే.. హ్యాక్ చేసిన కార్డుల్లో 18 శాతం ఒకే బ్యాంకుకు చెందినవి. కార్డులకు ఉండే మాగ్నటిక్ స్ట్రిప్‌లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. ‘ఇండియా-మిక్స్-న్యూ -01’ అనే కోడ్‌తో భారీ హ్యాక్ డేటా లభిస్తుంది.
ట్రాక్ 1తో పాటు ట్రాక్ 2లో ఉన్న డేటాలో 98 శాతం భారతీయులకు చెందినవే ఉన్నాయి. రూపే, మాస్టర్ కార్డు, వీసా కార్డులే ఉన్నట్లు వివరించారు. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్ కార్డుల వివరాలు హ్యాక్ చేసి ఓపెన్ సేల్‌లో ఉంచారు. యూజర్లు తమ అకౌంట్ల నుంచి అనధికార లావాదేవీలు జరిగితే అప్రమత్తమై వెంటనే రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.