తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్ట్ అయ్యారు.. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఆమెను రెండోసారి అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాని నిందితురాలిగా ఉన్న దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
ఉస్మానియా ఆస్పత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో నిందితులను ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల అవినీతిని బయటపెట్టారు.
ఈ కేసులో దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన సమయంలో ఆమె ఆస్తుల చిట్టాను గుర్తించిన ఏసీబీ షాక్ అయింది.. దేవికాకు సంబంధించి రూ.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సీజ్ చేసింది.
బయటి మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్ల వరకూ ఉండొచ్చునని ఏసీబీ అంచనా వేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కూడా దేవికారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు..