సీక్రెట్‌గా జుట్టు కట్ చేస్తాడు, ఫొటోలు తీస్తాడు : మహిళలతో డాక్టర్ అసభ్య ప్రవర్తన

  • Publish Date - May 4, 2019 / 12:11 PM IST

హైదరాబాద్ : ఉప్పల్ లో కీచక డాక్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్టర్ కి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిలుకానగర్ బస్తీలో దవాఖాన నిర్వహిస్తున్న డాక్టర్ బాలరాజు.. ఆసుపత్రికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చే మహిళల తల వెంట్రుకలు రహస్యంగా కట్ చేస్తున్నాడని, వారి ఫొటోలు సెల్ ఫోన్ లో తీస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. అంతేకాదు బాలరాజు ఇచ్చే మాత్రలకు వ్యాధులు నయం కావడం లేదని ఆసుపత్రికి వచ్చిన రోగులు వాపోయారు. బాలరాజు మాత్రం ఈ ఆరోపణలు ఖండించాడు. తాను రష్యాలో MBBS చదివినట్టు చెబుతున్నాడు. బాలరాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వైద్యం ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన బాలరాజుని కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

బాలరాజు నుంచి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో పెద్ద సంఖ్యలో మహిళలు ఫోటోలు ఉండటం చూసి షాక్ తిన్నారు. ఫోన్ లో అంతమంది మహిళల ఫొటోలు ఎందుకు ఉంచుకున్నాడు అనేది ఆరా తీస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే ఓ మహిళ తలనొప్పి, దగ్గుతో బాధపడుతోంది. ట్రీట్ మెంట్ కోసం డాక్టర్ బాలరాజు దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో డాక్టర్ బాలరాజు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించించిది. బాలరాజుపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ అని అదుపులోకి తీసుకున్నారు. అతడి వివరాలు సేకరిస్తున్నారు. అతడి విద్యార్హత సర్టిఫికెట్లను వెరిఫై చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే మహిళలకు.. వారికి తెలియకుండా బ్యాక్ సైడ్ నుంచి ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను తన ఫోన్ లో ఉంచుకున్నాడు. బాలరాజు ప్రవర్తనపై మొదట్నుంచి అనుమానాలు ఉన్నాయని స్థానికులు అన్నారు.