వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కిరాతకాన్ని తలుచుకుని కంటతడి పెడుతున్నారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కిరాతకాన్ని తలుచుకుని కంటతడి పెడుతున్నారు. ఆడపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో అని కంగారుపడుతున్నారు. ప్రియాంక రెడ్డి కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. 24గంటల్లోనే మిస్టరీని చేధించారు. 4 నిందితులను పట్టుకున్నారు. వారిని బహిరంగంగా ఉరి తియ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ నలుగురు మృగాళ్లు ప్రియాంకతో వ్యవహరించిన తీరు చాలా భయానకంగా ఉంది. అఘాయిత్యం చేసే క్రమంలో దుర్మార్గులు పాశవికంగా ప్రవర్తించారని తెలుస్తోంది. 45 నిమిషాల పాటు అకృత్యానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిసింది. దుండగులు ప్రియాంకకు బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బాధితురాలు తన స్కూటీ కోసం వేచి చూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, నవీన్ లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు.
ఆ సమయంలో బాధితురాలు హెల్ప్, హెల్ప్ అని అరిచినా.. వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఆమె వేదన అరణ్యరోదనే అయింది. తర్వాత దుండగులు ప్రియాంక నోరు నొక్కి లాక్కెళ్లారు. కొంతసేపటికే స్కూటీ తీసుకొచ్చిన శివ వారికి జత కలిశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమెపై లైంగికదాడి చేశారు. బాధితురాలు ప్రతిఘటించకుండా మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. రాత్రి 10.20 గంటలవరకు ఈ రాక్షసకాండ కొనసాగించారు. అప్పటికే అచేతన స్థితిలోకి చేరుకున్న డాక్టర్ నోరు, ముక్కును దుండగులు మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది.
సుమారు 30 నుంచి 45 నిమిషాలు నిందితులు డాక్టర్ ప్రియాంకపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు. అంతటితో ఆగక నిందితులు మార్గమధ్యలో మృతదేహంపై పలుమార్లు దారుణానికి పాల్పడినట్లుగా తేల్చారు. ప్యాంటు లేకుండానే లారీ క్యాబిన్ లోకి మృతదేహాన్ని ఎక్కించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు మళ్లీ కిందకెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్లుగా గుర్తించారు. ఘటనాస్థలిలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుల్లో మైనర్ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం నిందితులంతా 20 ఏళ్లకు పైబడిన వారేనని చెప్పారు.
ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయని, క్లూస్ సంపాదించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. మహిళలు, వృద్దులు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే 100కి ఫోన్ చేయాలని కోరారు. నలుగురు నిందితుల్లో ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్. ఏ2 శివ, ఏ3 జొల్లు నవీన్ క్లీనర్లు. ఏ4 చెన్న కేశవులు.