Doctor Suspended For Affair With Inmate In Jail
Woman Doctor suspended for Affair : జైల్లో విధులు నిర్వర్తించే ఓ డాక్టర్ ఏకంగా ఖైదీతోనే అఫైర్ పెట్టుకుంది. ఆ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ డాక్టర్ ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఓ జైల్లో జరిగింది. ఖైదీలకు వైద్యం చేసే మహిళా వైద్యురాలు అక్కడి ఓ ఖైదీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం బయటకు రావడంతో జైలు ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.
Ranga Reddy : ప్రియుడితో కలిసిన తల్లిన చంపిన యువతి
వివరాల్లోకి వెళితే.. కొన్ని ఏళ్లుగా జైల్లో ఆమె వైద్యురాలిగా పనిచేస్తోంది. ఖైదీలకు వైద్యం చేస్తూ అక్కడి ఒక ఖైదీతో చనువుగా ఉండేదట. అలా వారిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఖైదీతో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన అక్కడి జైలు సిబ్బంది వైద్యురాలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు.
జైల్లో ఖైదీతో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. స్పందించిన జైలు అధికారులు వెంటనే ఆమెపై విచారణ జరిపించారు. విచారణలో వైద్యురాలికి, ఖైదీకి వివాహేతర సంబంధ ఉందని తేలడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Mens wearing sarees : ప్రాయశ్చిత్తం కోసం..200 ఏళ్లుగా చీరలు కట్టుకుంటున్న మగవాళ్లు