Mens wearing sarees : ప్రాయశ్చిత్తం కోసం..200 ఏళ్లుగా చీరలు కట్టుకుంటున్న మగవాళ్లు

200 ఏళ్లుగా అక్కడి మగవారు చీరలు కట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం కోసమని చెబుతుంటారు.

10TV Telugu News

mens wearing sarees for 200 years : ఈ భూ ప్రపంచంలో ఎన్నో జాతులు, తెగల మనుషులు జీవనం సాగిస్తున్నారు. ఒక్కో ప్రాంతంవారిది ఒక్కో రకమైన సంస్కృతి సంప్రదాయాలు. ఒక్కో రకమైన నమ్మకాలు, ఆచారాలు. కొన్ని నమ్మకాల గురించి వింటే ఆశ్చర్యపోతాం. మరికొన్ని ఆచారాల గురించి తెలిస్తే..నోరెళ్లబెడతాం. అటువంటి ఓ వింత సంప్రదాయం గురించి తెలుసుకుందాం. అహ్మదాబాద్ ఓల్డ్‌సిటీలో మగవారు గత 200ల ఏళ్లనుంచి చీరలు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఇదో వింత సంప్రదాయం. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు అంటే దుర్గాష్టమి రోజున మగవాళ్లు చీరలు కట్టుకుని అమ్మవారి దేవాలయానికి వెళతారు. పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటు అమ్మవారికి గుడికి వెళతారు. ‘‘అమ్మా తల్లీ మా వల్ల తప్పు జరిగింది..మమ్మాల్ని క్షమించమ్మా.. ’అంటూ వేడుకుటారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? ఎందుకు మగవారు చీరలు కట్టుకుంటారు? వారికి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే..

Read more : ఇంట్లో వరుస చావులు : అతడు 30 ఏళ్లుగా పెళ్లి కూతురు అలంకరణలోనే

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఓల్డ్‌సిటీలో మగవారు చీరలు కట్టుకునే ఈ సంప్రదాయాన్ని 200ల ఏళ్లనుంచి కొనసాగిస్తున్నారు. దీన్ని గర్బా పండుగ అంటారు. ఈ గర్భాను షెర్రీ గర్బా అని కూడా అంటారు. 200 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో మహిళలకు రక్షణ ఉండేదికాదట. ఆడపిల్లల్ని పురుగుల కంటే హీనంగా చూసేవారట. కట్టుకున్న భార్యల్ని బానిసల్లా చూస్తూ నానా హింసలు పెట్టేవారట. కన్నతల్లి అనీగానీ..తోడబుట్టిన అక్కచెల్లెళ్లను కూడా చూడకుండా హింసించేవారట. అదే సమయంలో ఓ వ్యక్తి తన కూతుర్ని దారుణంగా చంపాడట.

ఆడవారిపై ఇంటువంటి హింసల్ని భరించలేని ‘సదుబా దేవి’ అనే అమ్మవారు ఇక్కడి మగవారిని శపించిందట. దీంతో భయపడ్డ మగవారు అమ్మవారిని శరణు వేడుకున్నారట. దీనికి పరిష్కారం చూపించు తల్లీ అంటూ వేడుకున్నారట. ఆడవారిని హింసించాం కాబట్టి దీనికి ప్రాయశ్చితంగా సదువాదేవి మాత పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించి ఆడవారిలా చీరలు కట్టుకుని అమ్మవారిని వేడుకోవటం అప్పటినుంచి కొనసాగుతోందట.

Read more : పాచిపని చేసే భార్య..రిక్షా తొక్కేభర్త..నెరవేరిన సొంతింటి కల ‘ఉత్తమ ఇల్లుగా జాతీయ అవార్డు’

అప్పటి నుంచి నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి రోజున మగవారంతా చీరలు కట్టుకుని గర్బా అనే పేరుతో న్యత్యం చేస్తూ..ఇకపై తప్పు చేయమని.. తమను క్షమించమని అమ్మవారిని వేడుకుంటారు. అలా చేస్తే తమ కుటుంబం అంతా ముఖ్యంగా పిల్లలు దీర్ఘాయువుతో జీవిస్తారని నమ్ముతారు.అలా చేయకపోతే వారి కుటుంబాలపై సదుబా దేవత ప్రతీకారం తీర్చుకుంటుందని నమ్ముతారు. దీంతో బారోట్ కమ్యూనిటీకి చెందిన ఈ ప్రజలు అప్పటి నుంచి సదుమాత పట్ల కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం దుర్గాష్టమి రోజున ఇలా చీరలు కట్టుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలా అది ఆనవాయితీగా 200 ఏళ్లగా కొనసాగుతు వస్తోంది.