ఇంట్లో వరుస చావులు : అతడు 30 ఏళ్లుగా పెళ్లి కూతురు అలంకరణలోనే

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 06:57 AM IST
ఇంట్లో వరుస చావులు : అతడు 30 ఏళ్లుగా పెళ్లి కూతురు అలంకరణలోనే

నమ్మకం..నమ్మకమే జీవితం. నమ్మకం  మనిషిని ఏ పనైనా చేయిస్తుంది. అటువంటి ఓ నమ్మకం ఓ పురుషుడ్ని స్త్రీగా మార్చేసింది. స్త్రీగా అంటూ పూర్తిగా కాదు. స్త్రీ వేషధారణతోనే కాలం గడిపేంత స్థాయికి తీసుకెళ్లింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 సంవత్సారాలుగా ఓ పురుషుడు చీరల్నే కట్టుకుంటున్నాడు. అంతేకాదు ఓ పెళ్లి కూతురు అలంకరణ ఎలా ఉంటుందో అలా తయారవుతున్నాడు. ఇది వినటానికి చిత్రంగా వున్నా నమ్మకమే అతడ్ని అలా మార్చేసింది. 

వివరాల్లోకి వెళితే..అది యూపీ జలాల్‌పూర్ జిల్లా హజ్ ఖాస్ గ్రామం. అక్కడ చింతాహరణ్ చౌహాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి వయస్సు 66.  చౌహాన్ గత 30ఏళ్ల నుంచి మహిళలాగా  చీర కట్టుకుంటున్నాడు. అంతేకాదు..పొడువాటి జడ వేసుకుంటాడు. ముక్కుకి పెద్ద ముక్కెర పెట్టుకుంటాడు.. చెవులకు జుంకాలు,చేతుల నిండుగా గాజులు వేసుకుంటాడు. అచ్చంగా ఓ పెళ్లికూతురిలా కనిపిస్తాడు. 

చౌహాన్‌కు 14ఏళ్లలో పశ్చిమ బెంగాల్‌లోని దీనాజ్‌పూర్‌లో ఒక ఇటుక బట్టీ పనికి వెళ్లాడు. అక్కడ బట్టీ యజమానితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతో అతను చౌహాన్ కు తనకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి చౌహాన్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ఇంటికి వచ్చేయమని ఒత్తిడి చేయటంతో చౌహాన్ భార్యను వదిలేసి ఇంటికి వచ్చేశాడు. తరువాత భార్య కోసం మళ్లీ బెంగాల్ వెళ్లాడు. కానీ అప్పటికే భర్త వదిలి వెళ్లిపోవటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణంతో చౌహాన్ బాధ పడ్డాడు. 

తరువాత కుటుంబ సభ్యుల ఒత్తిడితో మళ్లీ  పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూడా చనిపోయింది. మరోసారి చేసుకున్నాడు. ఆమె కూడా చనిపోయింది. అలా ముగ్గురు భార్యలు చనిపోయారు. అంతేకాదు చౌహాన్  తండ్రి, అన్న, తమ్ముడు కూడా చనిపోయారు. అలా చౌహాన్ ఇంట్లో అతి తక్కువ కాలంలోనే మొత్తం  14మంది చనిపోయారు. చౌహాన్ వేదనకు అంతులేకుండా పోయింది. 

అలా బాధపడుతున్న చౌహాన్ కు భార్య కలలోకి వచ్చింది. కలలో ఆమె ఏడుస్తూ కనిపించింది. నీతో ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కన్నాను. కానీ నువ్వు నన్ను విడిచిపెట్టి పోయావు అని ఏడ్చిందట. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నీతోనే ఉంటాను అన్నదట. అలా ఉండాలి అంటే నువ్వు రోజు  చీర కట్టుకుని అచ్చంగా పెళ్లి కూతురిలా ఉండాలని..అలా ఉంటే ఎప్పుడూ నేను నీ వెంటనే ఉంటానని చెప్పిందట. దాంతో ఆనాటి నుంచి అంటే గత 30 ఏళ్ల నుంచి  చింతాహరణ్ చౌహాన్ పెళ్లి కూతురిలా పెద్ద జడ..చేతుల నిండా గాజులతో నవ వధువులా తయారవుతున్నాడు. 

ఈ విషయంపై చౌహాన్ మాట్లాడుతూ..అమాయకురాలైన తన భార్య అకాల మరణమే తన కుటుంబం నాశమయ్యేలా చేసిందని..అందుకే తన భార్య కోరిక మేరకు తాను  చీర కట్టుకోవటం ప్రారంభించాననీ…కానీ రాను రాను గాజులు, ముక్కు పుడక, బొట్టు, పెద్ద జడ వేసుకుంటున్నాననీ తెలిపాడు. నా కుటుంబ సభ్యుల్లో నా తండ్రి రామ్ జియావన్, అన్నయ్య చోటావు, అతని భార్య ఇంద్రావతి, అతని ఇద్దరు కుమారులు, తమ్ముడు పెద్దవాడు మరణించారు. ఇది చాలా తక్కువ వ్యవధిలో జరిగింది. దీని తరువాత, నా సోదరుల ముగ్గురు కుమార్తెలు మరియు నలుగురు కుమారులు కూడా చాలా త్వరగా మరణించారని అన్నాడు. తాను స్త్రీ వేషం వేసుకుంటున్న నాటి నుంచీ..తన కుటుంబ సభ్యుల మరణాలు ఆగిపోయయని తెలిపారు. తన ఆరోగ్యం కూడా మెరుగుపడిందని అన్నాడు.