కట్న దాహం : భర్త ఇంటి ముంగిట నిరసన

  • Publish Date - April 20, 2019 / 09:52 AM IST

విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. కట్న దాహానికి..మరో జానకీ వీధి పాలయింది. నిలువనీడ లేక నాలుగేళ్ల ఆడబిడ్డతో రోడ్డున పడింది. మంచి మాటలతో తీసుకువచ్చి కట్టుకున్న భార్యను, నాలుగేళ్ల బిడ్డను రైల్వే స్టేషన్లో అనాధలుగా వదిలేసి చల్లగా జారుకున్నాడో..ఓ ప్రబుద్ధుడు. డబ్బు కోసం, లగ్జరీల కోసమే ఈ పని చేశాడని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

ఆదుకుంటారని భావించి కొండంత ఆశతో భర్త ఇంటికి వెళితే.. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇంటికి తాళం వేసి కోడలిని, మనవరాలిని నడిరోడ్డుపై నిలబెట్టింది..ఆ అత్త. భర్త, అత్త దుర్మార్గ చర్యలతో..ఆ ఇల్లాలు శోక సంద్రంలో మునిగిపోయింది. నాలుగేళ్ల ఆడబిడ్డతో భర్త ఇంటి ముంగిటే నిరసనకు దిగింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని దయనీయంగా వేడుకొంటోంది. 

ఏలూరు, శాంతినగర్‌కు చెందిన జానకికీ..విశాఖకు చెందిన చింతపల్లి సందీప్‌తో.. 2008లో వివాహం జరిగింది. వివాహం సమయంలో..15 లక్షల నగదు, 30 కాసుల బంగారం ఇచ్చారు. అది కాకుండా..అడిగిన ప్రతి సారి లక్ష, రెండు లక్షల చొప్పున ఇస్తూనే ఉన్నారు. సందీప్ రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే వాడు. డబ్బు కోసం, వస్తువుల కోసం అనేక మార్లు జానకిని చిత్రహింసలకు గురి చేసినా.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. విధుల్లో అలసత్వం కారణంగా ఏడేళ్ల కిందట సందీప్ సస్పెన్షన్‌కు గురయ్యాడు.

అప్పటి నుంచి అత్తారింట్లోనే ఉంటున్నాడు. సందీప్ మామ అధికారులతో మాట్లాడి 2018లో సందీప్ కి మళ్ళీ రైల్వేలో ఉద్యోగం వేయించాడు. చత్తీస్ గడ్, బచేలిలో వీధుల్లో చేరాడు. గత సెప్టెంబర్‌లో విశాఖ నుంచి బచేలి వెళ్లి ఉద్యోగంలో చేరాడు. అప్పటినుంచి భార్య పిల్లల్ని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. విశాఖ వచ్చినా..తన తల్లి, తన తమ్ముడిని కలిసి వెంటనే బచేలి వెళ్లిపోయేవాడు. తన భర్త విశాఖ వస్తున్నా,. తనను కలవడం లేదని తెలుసుకున్న ఆమె..అత్త ఇంటికి వెళ్ళింది అక్కడ అవమానాలు ఎదురు కావడంతో న్యాయం కోసం వేడుకొంటోంది