మందేస్తే ఆ కిక్కేవేరు అంటారు మందుబాబులు. అయితే ఆ కిక్కు లిమిట్ లో ఉన్నంత వరకు ఎవరికీ ప్రాబ్లమ్
మందేస్తే ఆ కిక్కేవేరు అంటారు మందుబాబులు. అయితే ఆ కిక్కు లిమిట్ లో ఉన్నంత వరకు ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. కానీ లిమిట్ క్రాస్ అయితేనే సమస్య. మందు ఎక్కువైతే మత్తు పెరుగుతుంది. ఆ మత్తులో మందుబాబులు ఏం చేస్తారో వారికే తెలియదు. పురుషులకే కాదు మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. ఫుల్లుగా తాగిన ఓ మహిళ.. పబ్లిక్‌గా ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అంతటితో ఆమె దాహం తీరనట్టుంది. ప్రియుడి నాలుకను కూడా కొరికేసింది. దీంతో ఆ వ్యక్తి లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. ఇంత జరిగాక కూడా ఆమె మత్తు మాత్రం దిగలేదు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తిపై ముద్దులతో దాడి చేసింది. అతడి నాలుకనూ కొరికి గాయపర్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది.
ముందు ముద్దుల వర్షం, తర్వాత నాలుక కొరికేసింది:
పాలకొల్లులో నివాసం ఉంటున్న ఓ మహిళ.. భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం షాపులు ఈ మధ్యే తెరవడంతో.. ప్రియుడుతో కలిసి మద్యం సేవిస్తోంది. ఇక.. మొన్న కూడా మద్యం కొనుగోలు చేసి.. పీకలదాకా తాగింది. మద్యం మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియకుండా.. కాలనీలోనే బహిరంగంగానే ప్రియుడ్ని ముద్దులతో ముంచెత్తింది. మద్యం మత్తులో ఏదో అలా చేస్తుందని అంతా భావించారు. ప్రేమతో ముద్దులు పెడుతుందనుకుని ప్రియుడు కూడా సంబరపడ్డాడు. ఇంతలో ఆమె ఒక్కసారిగా ప్రియుడి నాలుక కొరికేసింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. ఆమె నుంచి తప్పించుకుని పరుగులు తీశాడు.
మరో వ్యక్తిపైనా ముద్దులతో దాడి చేసి నాలుక కొరికేసింది:
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. ఇంకా మత్తులోనే ఉన్న ఆ మహిళ.. మరో వ్యక్తిపై ముద్దులతో దాడి చేసింది. అతడి పెదాలపై బుగ్గలపై ముద్దాడుతూ.. కొరకసాగింది. అంతేకాదు.. అతడి నాలుకను కూడా గాయపరిచింది. ఆమె బారి నుంచి ఆ వ్యక్తి మొత్తానికి తప్పించుకోగలిగాడు. ఇలా మద్యం మత్తులో ఏం చేస్తుందో కూడా అర్థం కాకుండా.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించింది ఆ మహిళ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా మద్యం మత్తులోనే ఉన్నారని … ఫుల్‌గా తాగారని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా మద్యం ఎంత పని చేసింది రా దేవుడా అని బాధితులతో పాటు స్థానికులు వాపోయారు.