Gurugram: రోడ్డు మీద పూలకుండీలు దొంగిలించిన కియా కారు ఓనర్ మీద కేసు నమోదు

Gurugram: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఒక కియా ఓనర్ రోడ్డు మీద పూల కుండీలు దొంగిలించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. 40 లక్షల రూపాయల కారు ఉండి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కాగా, ఈ ఘటనపై గురుగ్రాం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. జాతీయ రహదారి మీద 15 పూల కుండీలు అపహరించిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

48వ నంబర్ జాతీయ రహదారిలో ఉన్న శంకర్ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ పుటేజీలు చూస్తే తెలుస్తోంది. ఒక వ్యక్తి ఈ తతంగాన్ని అంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. కారుపై వీఐపీ నంబర్ ఉండటంతో అతనొక గవర్నమెంట్ ఆఫీసర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కారు ఎల్విష్ యాదవ్ అనే ఒక యూట్యూబర్‭ది అని నెట్టింట్లో గట్టి ట్రోలింగ్ అవుతోంది. రూ.40 లక్షల కారులో తిరుగుతున్న ఆ వ్యక్తి దగ్గర మొక్కలు కొనేందుకు కనీసం రూ.40 కూడా లేవా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Rahul Gandhi: గెడ్డం గీసుకుని, సూట్ వేసుకుని కొత్త లుక్‭లో ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను గుర్తించిన గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ (డిసి) నిశాంత్ కుమార్ యాదవ్ దొంగతనంపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (జిఎండిఎ)ని ఆదేశించారు. చోరీకి గురైన వాటిలో హైడ్రేంజ, డాలియా, మేరిగోల్డ్ మొక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జీ20 సదస్సులో భాగంగా మార్చి 1 నుంచి 4 వరకు నగరంలో జరగనున్న అవినీతి వ్యతిరేక గ్రూప్‌ మీటింగ్‌ కోసం శంకర్‌చౌక్‌తో పాటు పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు పూలకుండీలను ఏర్పాటు చేసినట్లు డీసీ యాదవ్‌ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు