Bank Robbery : గ్రాండ్‌గా పెళ్ళి చేసుకోటానికి బ్యాంకుకే కన్నం వేసిన ఘనుడు

పెళ్లి గ్రాండ్‌గా జరుపు కోవాలనుకుని ఒక ప్రబుధ్దుడు తాను పని చేస్తున్న బ్యాంకులోనే చోరీ చేసి పోలీసులకు దొరికిపోయిన ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.

Bank Robbery : పెళ్లి గ్రాండ్‌గా జరుపు కోవాలనుకుని ఒక ప్రబుధ్దుడు తాను పని చేస్తున్న బ్యాంకులోనే చోరీ చేసి పోలీసులకు దొరికిపోయిన ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సవదత్తి తాలూకా, మురుగోడు డీసీసీ బ్యాంకులో మార్చి 6వ తేదీన భారీ దొంగతనం జరిగింది. ఈఘటనలో  ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దుండగులు దోచుకెళ్లారు.  బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దొంగతనం జరిగిన తీరును చూసి ఇది ఇంటి దొంగల పనే అని తేల్చారు. అనుమానితుడైన బ్యాంకులో పని చేస్తున్న క్లర్క్‌ బసవరాజు సిద్ధంగప్ప హుణిసికట్టి (30)ని అదుపులోకి  తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు.  అతడి అనుచరులు సంతోష్‌ కాళప్ప కుంబార (31), గిరీశ్‌ (26) లతో కలిసి దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.

వారి వద్దనుంచి  నాలుగుకోట్ల 20 లక్షల  రూపాయల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి దుండగలు చోరీ చేశారు. దోచుకున్న సొత్తును జిల్లాలోని రామదుర్గ తాలూకా తోరణగట్టి గ్రామంలోని వ్యవసాయ  తోటలో పాతి పెట్టారు. తన పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు అవసరం అయి ఈ చోరీకి చేసినట్లు పాల్పడినట్లు క్లర్క్‌ బసవరాజు విచారణలో పోలీసులకు తెలిపాడు.

Also Read : Cold-Blooded Killer : ఒంటరి పురుషులపై దాడి

ట్రెండింగ్ వార్తలు