వివాహేతర సంబంధం, భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

  • Publish Date - October 11, 2020 / 10:49 AM IST

extramarital affair : మానవ సంబంధాలు రానురాను దిగజారిపోతున్నాయి. భార్య భర్తల బంధానికి విలువలు కరిగిపోతున్నాయి. కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడో ఓ భర్త. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్ రూంలో ఏ ఆర్ కానిస్టేబుల్ తో ఉన్న తన భార్యను పోలీసుల సహాయంతో పట్టుకున్నాడు.



తన భార్య..కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని రవి తెలుసుకున్నాడు. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భావించాడు. నిఘా పెట్టాడు. పార్లర్ కు వెళ్లి వస్తానని భార్య చెప్పింది. ఎందుకో రవికి అనుమానం కలిగింది. ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న వంశీ కృష్ణతో కలసి హోటల్ కు వెళ్లింది.



ఈ విషయం రవికి తెలిసింది. పోలీసులకు విషయం చెప్పి..వారితో కలిసి హోటల్ కు వెళ్లాడు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తాను బ్యూటీపార్లర్ నడుపుతుందని, పార్లర్ కు వెళుతున్నానని చెప్పి ఇంత మోసం చేస్తుందని ఊహించలేదని రవి వాపోయాడు. అనంతరం ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు.