అధికారులు ఎన్నిదాడులు చేస్తున్నా నకిలీలుల తయారు చేసే మాయగాళ్లు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు.
హైదరాబాద్: అధికారులు ఎన్నిదాడులు చేస్తున్నా నకిలీలుల తయారు చేసే మాయగాళ్లు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో నకిలీ టీ పొడి విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారస్తులను చాదర్ ఘాట్ పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మలక్ పేటలోని శ్రీకృపామార్కెట్‌లోని శ్రీపవన్ స్తుతి స్టోర్స్‌లో నకిలీ రెడ్ లేబుల్ టీపొడి విక్రయిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు షాపు పై దాడి చేసి రూ.2 లక్షల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. షాపు నిర్వాహకుడు దినేశ్‌కుమార్ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బేగం బజారులోని సుమిత్రన్ ఏజెన్సీ పై దాడి చేసి నిర్వాహకుడు సర్దా క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి సరఫరా ఇలా జరుగుతోంది
ఈ నకిలీ టీ పొడి మధ్య ప్రదేశ్ నుంచి నగరానికి సరఫరా అవుతుందని, బేగం బజార్ లోని సుమిత్రన్ ఏజెన్సీ అధినేత సర్దా క్రాంతి ద్వారా మలక్‌పేటలోని కృపామార్కెట్‌కు తరలించి అక్కడ నుంచి హోల్‌సేల్‌గా నగరంలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితులు సర్దా క్రాంతి, దినేశ్ కుమార్ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స