హైద్రాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం లోని 7 వ అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఉదయం 6 గంటల సమయంలో 7 వ అంతస్తులోంచి పొగలు రావడం తో స్థానికులు సమాచారం ఇచ్చారని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. కంప్యూటర్, టెలి కమ్యూనికేషన్ కు సంబంధించిన డ్రాయింగ్స్ కాలిపోయినట్లు తెలిపారు.
Also Read : ఓటు లేదని తెలిసి ఆమె గుండె ఆగిపోయింది