సూరత్ లోని టెక్స్ టైల్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

  • Publish Date - January 21, 2020 / 02:57 AM IST

గుజరాత్ లోని సూరత్ టెక్స్ టైల్ మార్కెట్ లో మంగళవారం తెల్లవారుఝూమున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని రఘువీర్ టెక్స్ టైల్ మార్కెట్ లోని 10 అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే మార్కెట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. వస్త్ర దుకాణాలు ఉన్న మార్కెట్ లో మంటలు వ్యాపించటంతో సుమారు 40 అగ్నిమాపక వాహానాలు మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి.