Kiss Ragging In Odisha : వీడియో.. ర్యాగింగ్ పేరుతో రాక్షసానందం.. కాలేజీ అమ్మాయికి ముద్దులు పెట్టి, వీడియో తీసి..

ర్యాగింగ్ పేరుతో ఆ కుర్రాళ్లు రాక్షసానందం పొందారు. అమ్మాయి పట్ల దారుణంగా వ్యవహరించారు. ఆ బాలికకు ముద్దులు పెట్టి, వీడియో తీసి శాడిస్టుల్లా బిహేవ్ చేశారు.

Kiss Ragging In Odisha : ర్యాగింగ్ పేరుతో ఆ కుర్రాళ్లు రాక్షసానందం పొందారు. బాలిక పట్ల దారుణంగా వ్యవహరించారు. ఆ బాలికకు ముద్దులు పెట్టి, శాడిస్టుల్లా బిహేవ్ చేశారు.

కాలేజీల్లో సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్ చేయడం కామన్. ర్యాగింగ్ పేరుతో సరదాగా ఆట పట్టిస్తారు. అంతవరకు ఓకే, కానీ, కొన్నిసార్లు ఇది హద్దులు మీరుతోంది. ర్యాగింగ్ పేరుతో కొందరు విద్యార్థులు చేస్తున్న పనులు, వికృత చేష్టలు సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు బరితెగించారు. బాలికకు ముద్దులు పెట్టి రాక్షసానందం పొందారు.

ఒడిశా బరంపురంలోని బినాయక్‌ ఆచార్య ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. అబ్బాయిలు.. ఓ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అందరి ముందు ఆ అమ్మాయికి ముద్దులు పెట్టారు. అంతేకాదు ఇదంతా మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి హింసించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయిని ఐదుగురు అబ్బాయిలు దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఓ విద్యార్థి బలవంతంగా ఆమెకు ముద్దు పెట్టాడు. అక్కడే చాలా మంది అమ్మాయిలు ఉన్నా వారు పట్టించుకోవడం మరింత దారుణం. పైగా ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. విద్యార్థుల వికృత చేష్టలు అందరిని షాక్ కి గురి చేశాయి. ర్యాగింగ్ పేరు వారు చేసిన నీచమైన పని మైండ్ బ్లాంక్ చేస్తోంది.

దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు మైనర్లు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 12 మంది విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. వారికి టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రమీల తెలిపారు. కాగా, ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థుల వికృత చేష్టలు ఆడపిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో తమ పిల్లల భద్రత పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.