Gun Fir in USA
Florida mass shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో రెండు రోజుల క్రితం కాల్పులు కలకలం జరిగిన ఘటనను మరవకముందే తాజాగా ఫ్లోరిడాలోనూ అటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో చోటుచేసుకున్న కాల్పుల్లో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని లేక్‌ల్యాండ్ పోలీసు అధికారులు చెప్పారు. ఓ వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు దాని కిటికీల్లో నుంచే కాల్పులు జరిపి పరారయ్యారని వివరించారు. ఉత్తర అయోవా అవెన్యూ, ప్లమ్ స్ట్రీట్ కు సమీపంలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. ఆ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
కాల్పుల ఘటనలో గాయాలపాలైన వారు అందరూ 20-35 ఏళ్ల మధ్య వారేనని తెలిపారు. వారిలో మహిళలూ ఎవరూ లేరని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు కూడా జరిగినట్లు తాము గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కోణంలోనూ తాము విచారణ జరుపుతున్నామని వివరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Pakistan Blast: పెషావర్ పేలుడు ఘటనలో 70కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద మృతదేహాలు