Pakistan Blast: పెషావర్ పేలుడు ఘటనలో 70కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద మృతదేహాలు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విధితమే. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద ముఠాకు చెందిన సభ్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయంకు 70 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Pakistan Blast: పెషావర్ పేలుడు ఘటనలో 70కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద మృతదేహాలు

Pakistan Blast

Pakistan Blast: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విధితమే. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద ముఠాకు చెందిన సభ్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈఘటనలో 61 మంది మరణించారు. 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయంకు 70 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో మసీదు వద్ద సుమారు 400 మంది పోలీసులు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, శిథిలాల కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Massive blast on Pakistan : పాక్‌లో బస్సుపై ఉగ్ర దాడి.. చైనా ఇంజినీర్లు సహా 10 మంది మృతి

గత పదకొండు నెలల్లో దేశంలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని, శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీస్తున్నామని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్ గవర్నర్ గులాం అలీ తెలిపారు. మసీదు వద్ద నాలుగు అంచెల భద్రత ఉంది. నమాజు సమయంలో పోలీసులు, సైన్యం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది కూడా తనిఖీలు నిర్వహించారు. అయినా ఆత్మాహుతి బాంబర్ నాలుగు అంచెల భద్రతను దాటుకొని మసీదులోకి వెళ్లి ముందువరుసలో కూర్చొని తననుతాను పేల్చుకున్నాడు. పేలుడు దాటికి మసీదులోని ఓభాగం మొత్తం కూలిపోవటంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు పేర్కొంటున్నారు

 

ఇస్లామాబాద్‌కు చెందిన పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కాన్‌ప్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం.. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో ఉగ్రవాద హింస 22శాతం పెరిగింది. గతేడాది కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పెషావర్ లోని షియా మసీదుపై ఇదే విధమైన దాడిచేసింది. ఈ దాడిలో 60 మందికిపైగా మరణించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఉగ్రవాద సంస్థ మానవ బాంబు దాడికి పాల్పడటంతో 70మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.