Massive blast on Pakistan : పాక్‌లో బస్సుపై ఉగ్ర దాడి.. చైనా ఇంజినీర్లు సహా 10 మంది మృతి

ఉత్తర పాకిస్తాన్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. పాకిస్తానీ సైనికులు, చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుళ్లకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 8 మంది మృత్యువాతపడ్డారు.

Massive blast on Pakistan : పాక్‌లో బస్సుపై ఉగ్ర దాడి.. చైనా ఇంజినీర్లు సహా 10 మంది మృతి

Massive Blast On Pakistan Bus Kills 10, Several Chinese Engineers Among Dead

Massive blast on Pakistan : ఉత్తర పాకిస్తాన్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. పాకిస్తానీ సైనికులు, చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుళ్లకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 8 మంది మృత్యువాతపడ్డారు. IED బాంబు దాడిలో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ దాడిలో చాలామంది తీవ్రంగా గాయపడగా.. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

దాసు ఆనకట్ట నిర్మాణ ప‌నుల‌్లో భాగంగా 30 మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు బస్సులో వెళ్తున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు బస్సుపై బాంబుతో దాడి చేశారు. ఐఈడీ పేలుళ్ల ధాటికి బస్సు లోయలో పడిపోయింది. చైనా ఇంజినీర్, మ‌రో సైనికుడు కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.

బ‌స్సులోనే టెర్రరిస్టులు బాంబులు పెట్టారా? లేదా రోడ్డు ప‌క్క‌న పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారా? అనేది క్లారిటీ లేదు. ఇదే ప్రాంతంలో గతకొన్ని ఏళ్లుగా చైనా ఇంజినీర్లు, పాకిస్తానీ కన్ స్ట్రక్చన్ వర్కర్లు దాసు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (Dasu hydroelectric project) కింద పనులు చేస్తున్నారు.