కేటీఆర్ పీఏనంటూ మాజీ క్రికెటర్ మోసం

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. ఓ

  • Publish Date - February 15, 2020 / 03:43 PM IST

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. ఓ

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. ఓ కంపెనీ అడ్డంగా దోచుకున్నాడు. ఫిబ్రవరిలో.. కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రమాణస్వీకార సభలో కంపెనీకి స్పాన్సర్ షిప్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ప్రైమ్ ఇండియా కంపెనీ దగ్గర రూ.3.40 లక్షలు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తన బంధువుల ట్రీట్ మెంట్ కోసం అత్యవసరంగా రూ.2 లక్షలు కావాలని నాగరాజు అడిగాడు. దీంతో కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. నాగరాజు పేరుతో గూగుల్ లో సెర్చ్ చేశారు. అతడు చీటర్ అని తెలుసుకున్నారు.

తొలుత షాక్ తిన్న కంపెనీ యాజమాన్యం.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన నాగరాజుపై గతంలోనూ చీటింగ్ కేసుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇంకా ఎలాంటి మోసాలు చేశాడు, ఎంతమందిని చీట్ చేశాడు అనే వివరాలు సేకరిస్తున్నారు.

కాగా, కేటీఆర్ పీఏ అని నాగరాజు చెప్పిన మాటలను ఆ కంపెనీ వాళ్లు ఎలా నమ్మారో అర్థం కావడం లేదన్నారు పోలీసులు. ముందు వెనుక ఎంక్వైరీ చేసుకోకుండా గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదన్నారు. ఏదైనా అనుమానం వస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.