Road Accident
Mali Road Accident : ఆఫ్రికా దేశంలోని మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బస్సు ఢీ కొన్న ఘటనలో 41 మంది మరణించగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్ట్ 3 మంగళవారం నాడు కూలీలు. సామాగ్రితో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును ఢీకొట్టటంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ టైర్ పేలి, వాహంనంపై డ్రైవర్ పట్టుకోల్పోవటంతో ……బస్సుకు ఎదురుగా దూసుకెళ్లి ఢీ కొట్టినట్టు స్ధానిక వార్తా సంస్ధలు తెలిపాయి. ఆసమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తున్నట్లు తెలిసింది. ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు. ప్రమాద స్ధలం మృతదేహాలు,క్షతగాత్రులతో భయానకంగా మారింది. ఈ ప్రమాద ఘటన వీడియోలు, ఫోటోలు స్ధానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాలిలో రోడ్లు సరిగా లేకపోవటం కూడా ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది.